Colombo Test : స్వదేశంలో భారత జట్టు చేతిలో కంగుతిన్న శ్రీలంక సిరీస్ సమం చేయాలనే కసితో ఉంది. గాలే టెస్టు ఓటమి.. ఇద్దరు కీలక ఆటగాళ్లకు గాయాల నేపథ్యంలో కొలంబో టెస్టుకు కీలక మార్పులు చేసింది లంక. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన దినేశ్ చండీమాల్, కమిందు మెండిస్‌కు విశ్రాంతినిచ్చింది.
గాలే టెస్టులో 165 పరుగుల ఓటమితో కొలంబోలో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది శ్రీలంక. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో రెండు కీలక మార్పులు చేసింది ఆతిథ్య జట్టు. నాలుగో రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన దినేశ్ చండీమాల్.. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న కుశాల్ మెండిస్‌ను పక్కన పెట్టేసింది.
Sri Lanka have added Kamil Mishara and Sahan Arachchige to their Test squad for the crucial second Test against India that begins on August 23.
Dinesh Chandimal and Kusal Mendis were earlier ruled out of contention. pic.twitter.com/ziILf8hF8n
— Cricbuzz (@cricbuzz) August 20, 2026
కొలంబో టెస్టు కోసం వీరిద్దరి బదులు ఆల్‌రౌండర్ కమిల్ మిశ్రా, సహన్ అరాచ్చిగేలను స్క్వాడ్‌లోకి తీసుకుంది లంక. సొంతగడ్డపై నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్‌లో మెరిసిన మిశార తుది జట్టులో ఉండే అవకాశముంది. అయితే.. ఓపెనర్ పథుమ్ నిశాంక కూడా ఈ మ్యాచ్‌కు డౌటే అనిపిస్తోంది. ఆగస్టు 23 నుంచి రెండో టెస్టు మొదలవ్వనుంది.