శ్రీకాంత్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘కోతల రాయుడు’. సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. ఏఎస్కే ఫిలింస్ బ్యానర్ పై ఏఎస్ కిషోర్, కొలన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డింపుల్ చొపడే, నటాషా దోషి నాయికగా నటించారు. వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. కామెడీ, ఫైట్స్ బాగుంటాయని, కుటుంబ ప్రేక్షకులు చూసేలా ‘కోతల రాయుడు’ సినిమా ఉంటుందని చెబుతున్నారు దర్శకుడు సుధీర్ రాజు. పృథ్వీ, మురళీ శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – బుజ్జి, ఎడిటర్ – ఉద్ధవ్.