హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ బ్యాంకింగ్ రుణ మేళాలు నిర్వహించాలని రైతు రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరిరావు కోరారు. వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడేందుకు ఈ మేళాలు ఉపయోగపడుతాయని చెప్పారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.