ప్రారంభ ధర రూ.19.49 లక్షలు
సింగిల్ చార్జింగ్‌తో 517 కిలోమీటర్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా..దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. తోమహవాక్ ఈవీ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.19.49 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.23.49 లక్షలుగా నిర్ణయించింది. 15.6 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆటోమేటిక్ ైక్లెమెట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ చార్జర్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
69.2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 517 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 8.2 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు కేవలం 35 నిమిషాల్లోనే 20 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జికానున్నది. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్, టాటా సఫారీ ఈవీలకు పోటీగా సంస్థ ఈ వాహనాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా డైరెక్టర్ పార్థ జిందాల్ మాట్లాడుతూ..భారత్‌లో ఈవీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించారు.