
హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్ కమిటీ సభ్యుడిగా సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే నియమితులయ్యారు. అంతరాష్ట్ర నీటి మండలి చీఫ్ ఇంజినీర్ మోహన్‌కుమార్ స్థానంలో దేశ్‌పాండేను నియమిస్తున్నట్టు కేంద్ర జల్‌శక్తి సంఘం సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ ఆమోదం తెలిపారు.