హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. ఈ మేరకు సోమవారం టీ-హబ్‌లో ‘బయాండ్ నంబర్స్-ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ కేర్’ అనే అంశంపై ‘హోమా సీఎంఈ-2026’ పేరిట నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, స్టార్టప్ రంగాలను హెల్త్ కేర్‌తో సమర్థవంతంగా అనుసంధానం చేసే కాంప్రహెన్సివ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మెడిసిన్‌ను టెక్నాలజీతో మిళితం చేస్తున్నామని తెలిపారు. మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, వీటిని కేవలం సంప్రదాయ వైద్య విధానాలతోనే కాకుండా, లైఫ్సె్టైల్ డాటాను విశ్లేషించడం ద్వారా సమర్థవంతంగా ఎదురొనేందుకు అవకాశముందని చెప్పారు.
ఈ తరహా దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించాల్సిన అవసరముందని, ఆ దిశగా మరిన్ని నూతన ఆవిషరణలు రావాలని కాంక్షించారు. రాబోయే రోజుల్లో హెల్త్ కేర్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను పరిషరించే కొత్త ఆలోచనలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. ప్రపంచంలోనే తొలి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్ ప్లోరర్’ను ప్రారంభించారు.