Anura Kumara Dissanayake | తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్‌కి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు. తమిళనాడు మరియు శ్రీలంకల మధ్య తరతరాలుగా ఉన్న చరిత్ర, సంస్కృతి మరియు ప్రజల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని అధ్యక్షుడు దిస్సానాయకే కొనియాడారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు తన శుభాకాంక్షలు అందించారు.
భారత్ మరియు శ్రీలంకల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యం భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక అవకాశాలకు దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమిళనాడుతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి, ఇరు ప్రాంతాల ప్రజల పురోగతికి కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగతో పాటు అక్కడి పలువురు రాజకీయ నేతలు కూడా ఆయనకు మద్దతు తెలపడం విశేషం. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పును అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోంది.
Congratulations to Hon. C. Joseph Vijay on being sworn in as Chief Minister of Tamil Nadu.
Sri Lanka and Tamil Nadu are connected through history, culture, enterprise, and enduring people-to-people ties across generations. Our future holds immense economic promise and…
— Anura Kumara Dissanayake (@anuradisanayake) May 10, 2026