గాలె : శ్రీలంక మాజీ సారథి దిముత్ కరుణరత్నె అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గురువారం నుంచి గాలె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్టు తన కెరీర్లో చిట్టచివరి మ్యాచ్ అని అతడు తెలిపాడు. ఈ మ్యాచ్ కరుణరత్నె టెస్టు కెరీర్లో వందోవది కావడం గమనార్హం. 36 ఏండ్ల ఈ మాజీ కెప్టెన్ తన 14 ఏండ్ల కెరీర్లో 99 టెస్టులాడి 7,172 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 34 అర్ధ శతకాలున్నాయి.