యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం లక్ష్మీనరసింహ స్వామి గరుడ వాహనంపై మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సమేతంగా ఊరేగారు. సాయంత్రం బాలాలయంలో స్వామివారి దివ్య విమాన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేడుకలో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.