Sreeleela | అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో మేక రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి సందD’ చిత్రంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశం అందిపుచ్చుకుంది. ధమాకా, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలలో ఛాన్స్ కొట్టేసింది. అయితే కెరీర్ తొలినాళ్లలో హిట్స్ అందుకున్న శ్రీలీల ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాప్స్ అందిపుచ్చుకుంది.
శ్రీలీల ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో నటిస్తుంది. అలానే తమిళంలో కూడా సత్తా చాటుతోంది . ఇక ఈ ఏడాదే అమ్మడు బాలీవుడ్లో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది.స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం ‘దిలర్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్గా తీసుకున్నారు. అయితే శ్రీలీలకి సంబంధించిన ఓ వార్త ఇటీవల నెట్టింట హల్చల్ చేస్తుంది. శ్రీలీల,కార్తీక్ ఆర్యన్ ఇద్దరు ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తుండగా, వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీలీల ఇటీవల ముంబైలోనే ఎక్కువ దర్శనం ఇస్తుండడంతో ప్రచారం ఎక్కువైంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో ఒక అమ్మాయిని హగ్ చేసుకొని ఈ రోజు చాలా బిగ్ డే అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక పోస్ట్ చూసి వారందరు శ్రీలీల లుక్ చూస్తే ఆమె ఎంగేజ్మెంట్కి రెడీ అయినట్టు ఉందని అంటున్నారు. సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుందా అని ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.