Sreeleela | ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన శ్రీలీల చాలా తక్కువ సమయంలోనే యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందం, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, చురుకైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పెద్ద హీరోలతో పాటు యువ హీరోల సరసన కూడా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల శ్రీలీల ఓ విద్యాసంస్థ కార్యక్రమంలో పాల్గొని మరోసారి వార్తల్లో నిలిచింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైంది. విద్యార్థులతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ అందరినీ ఉత్సాహపరిచింది.
తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈ ప్రాంతానికి ఎప్పుడో వచ్చానని, మళ్లీ రావడం ఆనందంగా ఉందని తెలిపింది. చదువుతో పాటు లక్ష్యాలను కూడా స్పష్టంగా పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించింది. స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో విద్యార్థులు డ్యాన్స్ చేయమని కోరగా, శ్రీలీల సరదాగా స్పందించి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో చర్చనీయాంశమయ్యాయి. అభిమానులు ఆమె హ్యూమర్ సెన్స్‌ను మెచ్చుకుంటున్నారు. అయితే తే డ్యాన్స్ చేయమని కింద ఉన్న అబ్బాయిలు గట్టిగా అరవడంతో శ్రీలీల స్పందిస్తూ.. “నిజంగా పెళ్ళాన్ని అడిగినట్లు అడిగారు.. డ్యాన్స్ చేద్దాం.. కమాన్” అని అనడంతో పిల్లలు డ్యాన్స్ వేసి చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే శ్రీలీల కన్నడ చిత్రం ‘కిస్’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి, తెలుగు ప్రేక్షకులకు ‘పెళ్లి సందడి’తో పరిచయమైంది. ‘ధమాకా’ విజయంతో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. అనంతరం పలువురు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఆమెకు వచ్చిన పాత్రలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఎంపిక కావడం ఆమె కెరీర్‌కు కొత్త ఊపును ఇచ్చింది. తెలుగులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఒక చిత్రం చేస్తూ బిజీగా కొనసాగుతోంది.