Sushmita Konidela | మళ్లీ అత్త అయినందుకు సంతోషంగా ఉంది..సుస్మిత కొణిదెల ఎమోషనల్ కామెంట్స్
Sushmita Konidela | మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులకు కవలలు జన్మించడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లోనూ సంతోషాన్ని నింపింది. ఈ శుభవార్తను స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Sushmita Konidela | మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులకు కవలలు జన్మించడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లోనూ సంతోషాన్ని నింపింది. ఈ శుభవార్తను స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిరంజీవి వెల్లడించిన వివరాల ప్రకారం తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు శిశువులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. తమ కుటుంబంపై అభిమానులు, శ్రేయోభిలాషులు చూపిస్తున్న ప్రేమ, ఆశీర్వాదాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త బయటకు రావడంతో సినీ పరిశ్రమలోనూ, అభిమాన లోకంలోనూ ఆనందం వెల్లివిరిసింది. కొణిదెల కుటుంబానికి ఇది నిజంగా “డబుల్ బ్లెస్సింగ్”గా మారింది.
రామ్ చరణ్ – ఉపాసన దంపతుల కొత్త జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా సాగాలని అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొణిదెల కుటుంబంలో ఈ సంతోషకర వేడుక మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో సుస్మిత కొణిదెల తన సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది.2026 సంవత్సరం మా ఫ్యామిలీకి మంచి బిగినింగ్. మళ్లీ అత్త అయినందుకు నాకు సంతోషంగా ఉంది.ఈ సారి రెట్టింపు ఆనందంతో పాటు ప్రేమ ప్రత్యేకమైనది. చరణ్, ఉప్సీలకి ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ సుస్మిత తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది.
ఇక గత రాత్రి చిరంజీవి తన సోషల్ మీడియాలో తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రాసుకొచ్చారు. తమ కుటుంబంపై అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించిన ప్రేమ, ఆశీర్వాదాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఈ వార్త బయటకు రావడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమాన లోకం ఆనందంలో మునిగి తేలుతుంది.ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

