Mega Twins | అపోలో వద్ద మెగా ఫ్యాన్స్ హంగామా.. చరణ్ ఇంట ‘డబుల్’ సెలబ్రేషన్స్!
Ram Charan and Upasana | మెగా ఇంట 'డబుల్' ధమాకా మొదలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు.
Ram Charan and Upasana | మెగా ఇంట ‘డబుల్’ ధమాకా మొదలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.. అత్యంత సంతోషంతో, కృతజ్ఞతా భావంతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానని, తల్లీ బిడ్డలు ముగ్గురూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. మా ఇంట్లోకి ఈ బుజ్జి ప్రాణులు రావడం దైవ ప్రసాదంలా అనిపిస్తోందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
అయితే ఈ వార్త తెలిసిన వెంటనే మెగా అభిమానులు భారీ ఎత్తున అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుని బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో “జై చరణ్.. జై మెగాస్టార్” అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. 2023లో జన్మించిన క్లిన్ కారా తర్వాత, ఇప్పుడు ఈ కవలల రాకతో మెగా కుటుంబం మరింత పెద్దదైంది. ముఖ్యంగా మెగా వారసుడి రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ‘Mega Twins’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
#RamCharan & #Upasana Welcome twins
Fan celebration at apollo pic.twitter.com/8N6W4d021t
— IndiaGlitz Telugu™ (@igtelugu) January 31, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | టీవీకే ఎమ్మెల్యే మరణంతో కొలత్తూరులో ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ పోటీ చేస్తారా..?
Allu Arjun | కూతురితో సరదాగా .. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్!
Haindava | బెల్లంకొండ ‘హైందవ’ విడుదలకు బ్రేక్.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్న మేకర్స్!
Allu Arjun | నా జీవితపు ఆనందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ముద్దుల కూతురు అర్హపై అల్లు అర్జున్ క్యూట్ పోస్ట్!
Diabetes | డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు.. మూడింటికీ ఏంటి సంబంధం..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

