Sreeleela | కాలేజ్ స్టూడెంట్స్‌తో శ్రీలీల రచ్చ.. పెళ్లాన్ని అడిగినట్టే అడిగారు…
Sreeleela | ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన శ్రీలీల చాలా తక్కువ సమయంలోనే యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందం, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, చురుకైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పెద్ద హీరోలతో పాటు యువ హీరోల సరసన కూడా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Sreeleela | ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన శ్రీలీల చాలా తక్కువ సమయంలోనే యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందం, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, చురుకైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పెద్ద హీరోలతో పాటు యువ హీరోల సరసన కూడా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల శ్రీలీల ఓ విద్యాసంస్థ కార్యక్రమంలో పాల్గొని మరోసారి వార్తల్లో నిలిచింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైంది. విద్యార్థులతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ అందరినీ ఉత్సాహపరిచింది.
తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈ ప్రాంతానికి ఎప్పుడో వచ్చానని, మళ్లీ రావడం ఆనందంగా ఉందని తెలిపింది. చదువుతో పాటు లక్ష్యాలను కూడా స్పష్టంగా పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించింది. స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో విద్యార్థులు డ్యాన్స్ చేయమని కోరగా, శ్రీలీల సరదాగా స్పందించి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో చర్చనీయాంశమయ్యాయి. అభిమానులు ఆమె హ్యూమర్ సెన్స్‌ను మెచ్చుకుంటున్నారు. అయితే తే డ్యాన్స్ చేయమని కింద ఉన్న అబ్బాయిలు గట్టిగా అరవడంతో శ్రీలీల స్పందిస్తూ.. “నిజంగా పెళ్ళాన్ని అడిగినట్లు అడిగారు.. డ్యాన్స్ చేద్దాం.. కమాన్” అని అనడంతో పిల్లలు డ్యాన్స్ వేసి చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే శ్రీలీల కన్నడ చిత్రం ‘కిస్’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి, తెలుగు ప్రేక్షకులకు ‘పెళ్లి సందడి’తో పరిచయమైంది. ‘ధమాకా’ విజయంతో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. అనంతరం పలువురు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఆమెకు వచ్చిన పాత్రలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఎంపిక కావడం ఆమె కెరీర్‌కు కొత్త ఊపును ఇచ్చింది. తెలుగులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఒక చిత్రం చేస్తూ బిజీగా కొనసాగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

