Sravanthi Chokarapu | ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్స్‌లో గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించే ముద్దుగుమ్మ స్రవంతి చొక్కారపు. టాలీవుడ్లో టాలెంటెడ్ యాంకర్స్ ఉన్నా కూడా అందంతో పాటు చలాకీతనంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తూ దూసుకెళ్తున్నారు . రాయలసీమలోని అనంతపురం జిల్లా కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009లో చదువు పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది.. అనంతరం ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి.. అతని కోసమే హైదరాబాద్ వచ్చేసింది. కొద్ది రోజుల పాటు హాస్టల్లో ఉంటూ పిల్లలకి పాఠాలు చెబుతూ జీవితం నెట్టుకొచ్చింది.
ఇంట్లో వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఎన్నో కష్టాలు పడి తిరిగి పెద్దల చెంతకు చేరుకుంది ఈ జంట.స్రవంతి చొక్కారపు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కొన్ని ఎపిసోడ్ లకు యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు. పలు యూట్యూబ్ ఛానెళ్లు, డైలీ కల్చర్, ఫ్యామిలీ ఫోకస్, జెమినీ టీవీలో యాంకర్ గా పని చేసి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఓ రేంజ్లో ఉంటుంది. కేక పుట్టించే అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది.
యాంకర్ స్రవంతి గ్లామర్ షో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు స్రవంతి ఫొటోషూట్లు మాములుగా ఉండవు. ఇక తాజాగా ఈ బ్యూటీ థాయ్‌లాండ్ వెకేషన్లో చిల్ అవుతుంది. అక్కడ తీసుకున్న ఫొటోలని షేర్ చేసి నెటిజన్స్ మైమరిచిపోయేలా చేస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాలో స్రవంతి కొన్ని పిక్స్ షేర్ చేయగా, ఇందులో స్రవంతి గ్లామర్ ట్రీట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వెకేషన్లోనైనా బికినీ ఫొటోలని షేర్ చేయాలంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.