హనుమకొండ చౌరస్తా, నవంబర్ 28: ప్రతి పాఠశాలలో క్రీడలను ప్రోత్సహించాలని అడిషనల్ కలెక్టర్, డీఈవో వెంకటరెడ్డి అన్నారు. హనుమకొండ జేఎన్ఎస్లో రెండు రోజుల పాటు నిర్వహించే పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదల విద్యాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. పాఠశాలల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసుకోవాలని పీఈటీలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో 16 పీఎం శ్రీ పాఠశాలల నుంచి 900 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, 100 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్, సమగ్రశిక్ష ప్లానింగ్ కో-ఆర్డినేటర్ బి.మహేష్, ఎస్జిఎఫ్ఐ సెక్రెటరీ వి.ప్రశాంత్‌కుమార్, పిఈటి అసోసియేషన్ బాధ్యులు ప్రభాకర్‌రెడ్డి, ఎస్.పార్థసారథి, సుధాకర్, పిఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు, కోచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.