లేహ్ : ఆజాది కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియాలో భాగంగా లేహ్ ఖరూలో శనివారం ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. లడక్ సైక్లింగ్ అసోసియేషన్ సహకారంతో లఢఖ్ పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ఫిట్నెస్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించారన్నారు. లేహ్ వాసులు ర్యాలీలో పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తులో కార్యక్రమాన్ని నిర్వహించిన లఢఖ్ పోలీసులు, అసోసియేసన్ను అభినందించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి సైతం సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
“प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में #FitIndiaCampagain के माध्यम से युवाओं को फिटनेस के प्रति जागरूक किया जा रहा है।यह देखना सुखद है कि 11000 फ़ीट की ऊँचाई पर भी लेह लद्दाख के युवा फ़िटनेस के प्रति कितने उत्साहित हैं”
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) September 25, 2021
श्री @ianuragthakur pic.twitter.com/bCwJWtCwaw