Spirit | పాన్–ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘యానిమల్’ తర్వాత వంగా నుంచి వస్తున్న చిత్రం కావడంతో, కంటెంట్ పరంగా కూడా అభిమానుల్లో భారీ క్యూరియాసిటీ నెలకొంది.ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, టీ–సిరీస్ సంస్థతో కలిసి సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రభాస్, త్వరలోనే షూటింగ్లో జాయిన్ కానున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు ‘స్పిరిట్’కు సంబంధించి ఓ బిగ్ రూమర్ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. అదేంటంటే… ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త. కథలో ప్రభాస్ పాత్రకు తండ్రిగా చిరంజీవి నటిస్తారని, ముఖ్యంగా సెకండాఫ్‌లో దాదాపు 15 నిమిషాల పాటు ఆయన పాత్ర ఉండబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది నిజమైతే, ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన మెగా–సూపర్ స్టార్ కలయికగా నిలవనుంది. గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమాలు కూడా చిరంజీవి చేతుల మీదుగానే జరగడం. అప్పటి నుంచే ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారనే గాసిప్స్ మొదలయ్యాయి.
అంతేకాదు, ‘యానిమల్’లో రణబీర్ కపూర్ తండ్రి పాత్రను అనిల్ కపూర్ ద్వారా పవర్‌ఫుల్‌గా చూపించిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు చిరంజీవి పాత్రను ఇంకెంత ఇంటెన్స్‌గా డిజైన్ చేశాడో అన్న చర్చ అభిమానుల్లో ఊపందుకుంది. ప్రభాస్, చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ ఊహించడానికే కష్టం. అయితే, ఇప్పటివరకు ఈ మెగా కాంబినేషన్‌పై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ వార్తలు నిజమా? లేక అభిమానుల ఊహల్లో పుట్టిన సంచలనమా? అన్నది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.