IPL 2023 : సొంత గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) గర్జించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)పై 81 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(57), శార్దూల్ ఠాకూర్(68) అర్ధ శతకాలు బాదడడంతో కోల్‌కతా 204 రన్స్ స్కోర్ చేసింది. కొండంత లక్ష్య ఛేదనలో ఆర్సీబీ తడబడింది. కేకేఆర్ స్పిన్నర్ల దెబ్బకు కీలక ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో, ఆ జట్టు 123కే ఆలౌట్ అయింది. ఈ విజయంతో పదహారో సీజన్లో కోల్‌కతా బోణీ కొట్టింది. విజయంతో టోర్నీని ఆరంభించిన డూప్లెసిస్ సేనకు ఓటమిని రుచి చూపించింది.
భారీ లక్ష్య ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాపార్డర్ విఫలమైంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(21), డూప్లెసిస్(23) తొలి వికెట్‌కు 44 రన్స్ జోడించారు. స్పిన్నర్‌ను రంగంలోకి దింపడంతో ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ డూప్లెసిస్(23)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (5), హర్షల్ పటేల్(0)ను ఔట్ చేసి ఆర్సీబీని మరింత కష్టాల్లోకి నెట్టాడు. దాంతో, 19 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ ఐదు వికెట్లు కోల్పోయింది. వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలగు, సుయాశ్ శర్మ మూడు వికెట్లు తీశారు. సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్ధూల్‌కు ఒక వికెట్ దక్కింది.
A memorable first victory of #TATAIPL 2023 at home.@KKRiders secure a clinical 81-run win over #RCB ⚡️⚡️
Scorecard – https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/0u57nKO57G
— IndianPremierLeague (@IPL) April 6, 2023
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నాలుగో ఓవర్లో షాక్ తగిలింది. వెంకటేశ్ అయ్యర్ (3)ను డెవిడ్ విల్లే బౌల్డ్ చేశాడు. తర్వాత మన్దీప్ సింగ్ కూడా డిఫెన్స్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(57), శార్దూల్ ఠాకూర్(68) అర్ధ శతకాలతో చెలరేగడంతో కోల్‌కతా 204 రన్స్ స్కోర్ చేసింది. రింకూ సింగ్(46) రాణించాడు. నితీశ్ రానా(1), ఆండ్రూ రస్సెల్(0) విఫలమయ్యారు. 85 పరుగులకే ఐదు వికెట్లు పడ్డాయి. దాంతో, కోల్‌కతా 150 ప్లస్ చేయడమే గొప్ప అనిపించింది. కానీ, శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాక సీన్ మారింది. అతడు ధనాధన్ ఇన్నింగ్స్‌తో స్కోర్ వేగం పెంచాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 20 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌లతో యాభై రన్స్ సాధించాడు. ఐపీఎల్లో శార్ధూల్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. రింకూ, శార్దూల్ ఆరో వికెట్‌కు 103 రన్స్ జోడించారు. ఆర్సీబీ బౌలర్లలో డెవిడ్ విల్లే, కరణ్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. మైఖేల్ బ్రేస్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లకు తలా ఒక వికెట్ దక్కింది.