హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులు వర్సెస్ ఇంటెలిజెన్స్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైనట్టు సమాచారం. తాము సచివాలయంలోనికి వెళ్లే సమయంలో ఎస్పీఎఫ్ సిబ్బంది గేటు దగ్గర అడ్డుకుంటున్నారని ఇంటెలిజెన్స్ సిబ్బంది వాపోతున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులమని చెప్తున్నా వినటం లేదని, రోజూ వెళ్తున్నా గుర్తుపట్టకుండా, పదే పదే అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఎస్పీఎఫ్, బెటాలియన్ పోలీసులు రక్షణ కల్పించినప్పుడు కూడా తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, ఇప్పుడు కొత్తగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.