Archana Devi | అమ్మేసింది అనుకున్న అమ్మాయి.. కుమ్మేసింది.. అండర్-19 నయా సంచలనం అర్చన విజయగాథ
Archana Devi |ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రతైపూర్వలో జన్మించిన అర్చనా దేవి దేశానికి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. కష్టాల కడలి దాటితేనే సుఖాల తీరం వస్తుందని అక్షరాల నిరూపించింది.
Archana Devi | ఊహ తెలియకముందే తండ్రి దూరమయ్యాడు.. తోడుంటాడనుకున్న తోబుట్టువు అర్ధాంతరంగా కన్నుమూశాడు.. నిలువ నీడ లేక.. తినడానికి తిండిలేక నానా తంటాలు పడ్డ ఆ అమ్మాయి.. కష్టాల కడలి దాటుకొని దేశానికి ప్రపంచకప్ అందించింది!
మన దేశంలో అమ్మాయిలు క్రీడారంగంలో అడుగుపెట్టాలంటే ఉండే సహజ అడ్డంకులకు తోడు పేదరికం, తండ్రి లేని ఒంటరితనం ఆ చిన్నారిని కుంగదీశాయి. అయినా చనిపోయిన సోదరుడి కోరిక మేరకు అథ్లెట్ అవ్వాలనుకున్న ఆ అమ్మాయి.. మొదట రన్నింగ్‌పై ఆసక్తి కనబర్చింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఇష్టం పెంచుకొని.. తొలుత పేసర్‌గా, ఆ తర్వాత ఆఫ్ స్పిన్నర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ భారత అండర్-19 జట్టు ప్రపంచ కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఉపోద్ఘాతమంతా ఉత్తరప్రదేశ్ యువ ఆల్‌రౌండర్ అర్చనాదేవి గురించే!
పాలు అమ్ముకుంటూ కూతురిని పోషించడమే కష్టమైన సమయంలో.. ఇక క్రికెట్ శిక్షణకు డబ్బు వెచ్చించలేని అర్చనా తల్లి సావిత్రి.. తన కూతురిని బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. మారుమూల గ్రామం కావడంతో పాటు.. ఆ ఊరి నుంచి అప్పటి వరకు ఏ అమ్మాయి ఇంటికి దూరంగా ఉండి చదువుకోకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు సావిత్రి తీరును తప్పుపట్టారు. డబ్బు కోసం ఎవరికో అమ్మేసిందని, తప్పుడు పనులు చేయిస్తూ డబ్బు సంపాదిస్తోందని.. ఇలా మాటలతోనే ఆమెను చిత్రవధ చేశారు. అయినా కూతురు ఏదో ఒకటి సాధిస్తుందని బలంగా నమ్మిన సావిత్రి.. విమర్శలకు వెరవకుండా ఒంటరి పోరాటం చేస్తూ అమ్మాయిని ఆణిముత్యంగా మలిచింది!
న్యూఢిల్లీ: వెతకాలే కానీ.. మనదేశంలో ప్రతిభకు కొదవలేదని మరోసారి నిరూపితమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రతైపూర్వలో జన్మించిన అర్చనా దేవి దేశానికి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. కష్టాల కడలి దాటితేనే సుఖాల తీరం వస్తుందని అక్షరాల నిరూపించింది. క్యాన్సర్ బారిన పడిన తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోయాడు. ఉన్న కాస్త వ్యవసాయ భూమి నదీ తీర ప్రాంతంలో ఉండటంతో అది పంటకు ఉపయోగపడకుండా పోయింది. ఈ దశలో ఆటలంటే మాటలా! అయినా అర్చన తల్లి సావిత్రి.. అష్టకష్టాలు పడైనా సరే తన కూతుర్ని ప్రయోజకురాలిని చేయాలని బలంగా సంకల్పించింది.అందుకు తగ్గ మార్గం తెలియక ఇబ్బంది పడుతున్న ఆమెకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల చుక్కానిలా కనిపించింది. గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు తన కూతురిని వెంటబెట్టుకొని వెళ్లిన ఆ తల్లి అర్చనను అక్కడే వదిలి వచ్చింది. దీంతో గ్రామస్థులంతా ఆమెను విలన్లా చూశారు. అప్పటికే భర్త చనిపోవడం, పాము కాటుకు కొడుకు మృతి చెందడంతో సావిత్రి నష్టజాతకురాలని ఆమె ఇంటి ముందు నుంచి నడిచేందుకు కూడా గ్రామస్థులు ఇష్టపడకపోయేవారు.

విజయం సాధిస్తేనే ప్రపంచం గుర్తిస్తుందని చిన్నప్పుడు అర్థం చేసుకున్న అర్చన అంచలంచెలుగా ఎదిగింది. పాఠశాలలో మొదట రన్నింగ్‌పై ఆసక్తి కనబర్చిన అర్చన.. ఆరు నెలల తర్వాత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ఆమె కోచ్ పూనమ్ గుప్తా.. అర్చనను సానబెట్టింది. దీంతో అర్చన గాడిన పడగా.. క్రికెట్ ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో తల్లి మొదట తటపటాయించింది. అయినా కూతురి పట్టుదల ముందు ఆమె తలవంచక తప్పలేదు. అలా జూనియర్ స్థాయిలో రాణిస్తూ మంచి ప్రదర్శన కనబర్చింది. అర్చన బౌలింగ్ చేస్తున్న వీడియోను ఆమె కోచ్ పూనమ్.. కాన్పూర్‌లో క్రికెట్ శిక్షణ ఇచ్చే కపిల్ పాండేకు పంపింది. వాటిని గమనించిన కపిల్ పాండే.. కాస్త శ్రమిస్తే అంతర్జాతీయ బౌలర్ అవుతుందని గుర్తించి ఆమెను వెంటనే కాన్పూర్ రావాల్సిందిగా కోరాడు. అవకాశం అయితే వచ్చింది కానీ.. కాన్పూర్ వెళ్లడం, అక్కడ ఉండటం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో మరోసారి అర్చన ఆలోచనలో పడింది. అప్పటికే మంచి ఆటతీరు కనబరుస్తున్న అర్చనపై నమ్మకముంచిన పూనమ్ తగిన ఏర్పాట్లు చేసేందుకు ముందుకొచ్చింది.
అప్పటి వరకు ఏదో అల్లాటప్పాగా ఆడిన అర్చన కాన్పుర్‌లో అడుగుపెట్టిన తర్వాత సీరియస్‌నెస్ పెంచింది. కపిల్ పాండే అప్పటికే పలువురు అంతర్జాతీయ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడం కూడా అర్చనకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. అక్కడే ట్రైనింగ్ తీసుకోవడం అర్చనకు వరంగా మారింది. కపిల్ సార్ పర్యవేక్షణలో గంటల తరబడి నెట్స్‌లో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. జూనియర్ స్థాయిలో రాష్ర్టానికి ప్రాతనిధ్యం వహించే అవకాశం రావడంతోనే ఎగిరి గెంతేసిన అర్చన.. ఆ చాన్స్‌ను రెండు చేతులా ఒడిసిపట్టింది. అస్సాంతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసిన అర్చన.. ఆ సీజన్లో 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి భళా అనిపించింది. దీంతో చాలెంజర్ టోర్నీకి ఎంపికైన అర్చన అక్కడ కూడా నిలకడ కొనసాగించి భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో అర్చన తనవంతు పాత్ర పోషించగా.. యువభారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. దీంతో అర్చన ఊరు ఊరంతా సంబురాల్లో మునిగిపోయింది. తమ చేత్తో మంచినీళ్లు తాగేందుకు కూడా ఇష్టపడని వారు.. అర్చనను తమ సొంతబిడ్డలా అక్కున చేర్చుకుంటున్నారని ఆమె తల్లి సావిత్రి భావోద్వేగానికి లోనైంది. ఇది కదా విజయం అంటే. అర్చన పోరాటం ప్రపంచకప్ విజయానికి తక్కువ అనగలమా!
Read More :
Rishabh Pant | గుడ్ న్యూస్.. పంత్‌కు సర్జరీ సక్సెస్.. ఈ వారంలోనే డిశ్చార్జ్..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

