Virat Kohli | దయానంద సరస్వతీ సమాధిని దర్శించుకున్న విరాట్ – అనుష్క.. ఫొటోలు వైరల్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కా శర్మతో కలిసి స్వామి దయానంద సరస్వతీ ఆశ్రమాన్ని సందర్శించాడు. విరాట్ - అనుష్క దయానంద స్వామి గిరి సమాధిని దర్శించుకున్నారు.
Virat Kohli : భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కా శర్మ, కూతురు వామికతో కలిసి రిషికేశ్కు తీర్థ యాత్రకు వెళ్లాడు. విరుష్క జోడీ అక్కడి బృందావన్‌లోని స్వామి దయానంద సరస్వతీ ఆశ్రమాన్ని సందర్శించారు. దయానంద స్వామి గిరి సమాధిని దర్శించుకున్నారు. విరాట్, అనుష్క భక్తులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొననున్నారు. అనంతరం ఈ జంట ఆశ్రమంలో భండారా అనే వేడుక నిర్వహించున్నారు. అనుష్క, విరాట్ దయానంద సరస్వతి ఆశ్రమంలో దిగిన ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
తొలి టెస్టు నాగ్‌పూర్‌లో
ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనుకు రానుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఇరుజట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 9న మొదటి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఉంది. దాంతో భారత్‌కు ఈ టెస్టు సిరీస్ కీలకం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఇండియా ఫైనల్ బెర్తుపై కన్నేసింది. విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడం, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి రానుంది. అంతేకాదు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి హిట్టర్లు తొలి రెండు టెస్టులకు ఆడనున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తున్న భారత్ సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

