Rishabh Pant | గుడ్ న్యూస్.. పంత్కు సర్జరీ సక్సెస్.. ఈ వారంలోనే డిశ్చార్జ్..!
పంత్ ఆరోగ్యంపై అభిమానులకు శుభవార్త అందింది. పంత్ ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యిందని.. పంత్ త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పారు.
Rishabh Pant | టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పంత్ ఆరోగ్యంపై అభిమానులకు శుభవార్త అందింది. పంత్ ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యిందని.. పంత్ త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పారు.
‘పంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. వైద్య బృందం నుంచి ఈ శుభ వార్త అందింది. మొదటి సర్జరీ విజయవంతమైంది. ఈ వారంలోనే అతడు డిశ్చార్జ్ కానున్నాడు. ఆసుపత్రి వైద్యులతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మార్చి నెలలో మరో సర్జరీ అవసరం కావొచ్చు. అది ఎప్పుడు నిర్వహించాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుని మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం. పంత్ తిరిగి మైదనాంలోకి రావడానికి కనీసం 8 నుంచి 9 నెలల సమయం పట్టొచ్చు. ప్రస్తుతం మా దృష్టంతా అతడి రికవరీపైనే ఉంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. గతేడాది డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

