Mickey Arthur | ప్రపంచంలోనే మొదటి ఆన్లైన్ హెడ్ కోచ్‌గా మికీ ఆర్థర్..! ఏ జట్టుకో తెలుసా..?
దక్షిణాఫ్రికా మాజీ కోచ్ మికీ ఆర్థర్ త్వరలోనే అరుదైన గుర్తింపు సాధించనున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతడిని ఆన్లైన్ హెడ్ కోచ్‌గా నియమించనుంది. అదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ఆన్లైన్ హెడ్ కోచ్‌గా ఆర్థర్ రికార్డు క్రియేట్ చేస్తాడు.
Mickey Arthur : దక్షిణాఫ్రికా మాజీ కోచ్ మికీ ఆర్థర్ త్వరలోనే అరుదైన గుర్తింపు సాధించనున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతడిని ఆన్లైన్ హెడ్ కోచ్‌గా నియమించనుంది. అదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ఆన్లైన్ హెడ్ కోచ్‌గా ఆర్థర్ రికార్డు క్రియేట్ చేస్తాడు. ఆన్లైన్లో ప్రధాన కోచ్‌ను పెట్టుకోవడం ఏంటి? అనే సందేహం రావొచ్చు. కానీ, ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్ కోచ్‌కు అయ్యే ఖర్చును భరించే పరిస్థితుల్లో లేదు. దాంతో, పాక్ క్రికెట్ బోర్డు మికీ ఆర్థర్‌ను ఆన్లైన్లోనే కోచ్ బాధ్యతలు నిర్వహించాల్సిందిగా కోరనుంది. ఆ విషయమై అతనితో చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఒప్పందం కుదిరితే.. ఆర్థర్ కొన్ని రోజులు ఆన్లైన్లో తన సేవలు అందిస్తాడు. పాక్ ఆటగాళ్ల ఆట తీరును విశ్లేషించడంతో పాటు వాళ్లకు సలహాలు ఇవ్వడం అన్నీ ఆన్లైన్లో. భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్ కప్ ముందు ఆర్థర్ పాక్ జట్టుతో కలవనున్నాడని సమాచారం.
ఏక కాలంలో రెండు జట్లకు
మికీ ఆర్థర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని డెబ్రిషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు పూర్తిస్తాయి కోచ్‌గా ఉన్నాడు. పాక్‌తో ఒప్పందం కుదిరితే ఇకపై అతను ఏక కాలంలో రెండు జట్లకు కోచింగ్ ఇవ్వనున్నాడు. డెబ్రిషైర్ జట్టును గైడ్ చేస్తూనే పాక్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు.ఆర్థర్ గతంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు కోచ్‌గా సేవలందించాడు.
వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా
పోయిన ఏడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లోనూ ఆ జట్టు విజేత కాలేకపోయింది. దాంతో, వన్డే వరల్డ్‌కప్ 2023కి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని పాక్ భావిస్తోంది. అందుకని వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా అనుభవజ్ఞుడైన ఆర్థర్‌ను కోచ్‌గా నియమించాలని పాక్ క్రికెట్ బోర్డు అనుకుంటోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ కాంట్రాక్ట్ ముగియడంతో పాక్ బౌలింగ్ కోచ్‌గా తప్పుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

