ఈ నెల 11 వరకు నడపనున్న యాదగిరిగుట్ట డిపో
యాదాద్రి, ఫిబ్రవరి 2 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో ఈ నెల 11వరకు యాదగిరిగుట్ట బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 మంది ఉంటే కోరిన చోటికి బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. అమ్మవారి గద్దె వరకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.225, పిల్లలకు రూ.115, భువనగిరి నుంచి మేడారం పెద్దలకు రూ.240, పిల్లలకు రూ.120, బీబీనగర్ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.280, పిల్లలకు రూ.140, పోచంపల్లి నుంచి మేడారం పెద్దలకు రూ.320, పిల్లలకు రూ.160, రామన్నపేట నుంచి మేడారం పెద్దలకు రూ.325, పిల్లలకు రూ.165, ఆత్మకూరు(ఎం) నుంచి మేడారం రూ.295, పిల్లలకు రూ.150, మోత్కూర్ నుంచి మేడారం పెద్దలకు రూ.290, పిల్లలకు రూ.145, ఆలేరు నుంచి మేడారం పెద్దలకు రూ.225, పిల్లలకు రూ.115, జనగాం -మేడారం పెద్దలకు రూ.185, పిల్లలకు రూ.95 తీసుకుంటున్నట్లు వివరించారు. వివరాలకు 9959226310, 7989225791 నంబర్లను సంప్రదించాలని సూచించారు.