సియోల్: దక్షిణకొరియా నటి కిమ్ సే-రాన్ మృతిచెందింది. ఆమె వయసు 24 ఏళ్లు. సింగ్షు డాంగ్ జిల్లాలో తన ఇంట్లో ఆమె శవమై తేలారు. ఆమె ఫ్రెండ్ మృతదేహాన్ని గుర్తించింది. మృతి పట్ల అనుమానాలు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే ఏ కారణం చేత ఆమె ప్రాణాలు కోల్పోయిందో అన్వేషిస్తున్నట్లు చెప్పారు. కిమ్ తన కెరీర్‌ను చైల్డ్ ఆర్టిస్టుగా ప్రారంభించారు. దక్షిణ కొరియాలో ఎదుగుతున్న యువ హీరోయిన్గా ఆమెను భావించారు. 2000 సంవత్సరంలో ఆమె సియోల్‌లో జన్మించారు. 2009లో రిలీజైన ఏ బ్రాండ్ న్యూ లైఫ్ ఫిల్మ్‌తో ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించారు.
2010లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన ద మ్యాన్ ఫ్రమ్ నోవేర్, 21012 తీసిన థ్రిల్లర్ ద నైబర్ చిత్రాల్లో ఆమె నటించింది. 2014లో రిలీజైన ఎ గర్ల్ ఎట్ మై డోర్, 2016 ప్రసారమైన మిర్రర్ ఆఫ్ ద విచ్ టీవీ సిరీస్‌లో నటించింది. 2022లో ఆమెపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆమెకు 11 వేల పౌండ్ల ఫైన్ వేశారు. 2023లో వచ్చిన కొరియా డ్రామా బ్లడ్హూండ్స్ లో ఆమె చివరిసారి నటించింది. డ్రంకెన్ డ్రైవ్ కేసు తర్వాత ఆమె కష్టాలు మొదలయ్యాయి.