లండన్, నవంబర్ 5: దక్షిణాఫ్రికా రచయిత డేమన్ గాల్గట్ ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ గెలుచుకొన్నారు. ఫిక్షన్ విభాగంలో ఆయన రాసిన ‘ద ప్రామిస్’ పుస్తకానికి గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. బహుమతి కింద గాల్గట్ రూ.51 లక్షల(69వేల డాలర్లు) నగదు బహుమతి గెలుచుకొన్నారు. గాల్గట్ బుకర్ ప్రైజ్ ఫైనల్కు చేరడం ఇది మూడోసారి. ఆయన రాసిన గుడ్ డాక్టర్, ఇన్ ఏ స్ట్రేంజ్ రూమ్ పుస్తకాలు కూడా ఫైనల్ వరకు వెళ్లాయి. తాజాగా రాసిన ద ప్రామిస్ పుస్తకం దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష చరిత్రను తెలుపుతుంది.