పంజాబ్ కొవిడ్ -19 టీకా బ్రాండ్ అంబాసిడర్‌గా సోను సూద్
పంజాబ్‌లోని యాంటీ కరోనావైరస్ టీకా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోను సూద్ నియమితులయ్యారు

ఛండీగఢ్ : పంజాబ్‌లోని యాంటీ కరోనావైరస్ టీకా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోను సూద్ నియమితులయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదివారం తన నివాసంలో నటుడు సోనూ సూద్‌తో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
గత సంవత్సరం కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో వలసదారులకు, పేదలకు తమ సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి సోనూ సూద్ ఎంతో సహాయం చేసారు. కొవిడ్-19 మహమ్మారి మధ్య వేలాది మంది నిరుపేదలకు ఆహారం ఇచ్చినందుకు సోనూ సూద్ పేరు పతాక స్థాయికి చేరుకున్నది. అతను వలసదారుల మెస్సీయగా గుర్తింపునకు నోచుకున్నారు.
“నటుడు, పరోపకారి సోనుసూద్ కొవిడ్-19 టీకా డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి పంజాబీని కొవిడ్ టీకా చేరుకోవడానికి, వారిని రక్షించడానికి మా ప్రచారానికి మద్దతు ఇచ్చినందుకు సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. టీకాలు తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను ” అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలను ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి ఆదర్శంగా ఉండేందుకు ఇంతకు మించి మరెవ్వరూ లేరని సింగ్ అన్నారు.
టీకా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నందుకు సంతోషంగా, గౌరవంగా ఉన్నదని నటుడు సోనూ సూద్ తెలిపారు. “నా సొంత రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటానికి పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ ప్రచారంలో ఏదైనా పాత్ర పోషించడం నాకు చాలా ఆనందంగా ఉన్నది” అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
స్మగ్లర్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి
ఎంసీడీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్
ధైర్యం, థ్రిల్, పోటీ స్ఫూర్తి ఉన్న పురుషులే మంచి తండ్రులు
అమెరికాలో కరోనా మహమ్మారి నాలుగో వేవ్..?!
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
బడుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్రలో ఈ రోజు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

