
చిక్కడపల్లి, నవంబర్11 : పిల్లల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న నవ భారత్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలు, పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ఉపాధ్యక్షుడు గోపాల కృష్ణ, కన్వీనర్ డా. హిప్నో పద్మాకమలాకర్ తెలిపారు. గురువారం అశోక్‌నగర్‌లోని డాక్టర్ హి ప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొవిడ్ వలన రెండేండ్లుగా పిల్లలు ఒత్తిడితో సతమతమవుతున్నారని, పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. గెలుపొందిన విద్యార్థులకు క్లబ్ అధ్యక్షుడు జె.టి. విద్యాసాగర్ బహుమతులు అందజేస్తారని తెలిపారు.