Solar Panels | పారిస్, ఫిబ్రవరి 2: రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్ బిగించి విద్యుదుత్పత్తి చేసేందుకు ఫ్రెంచ్ రైల్వే ‘ఎస్ఎన్సీఎఫ్’ ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఏఆర్ఈపీ (ఎస్ఎన్సీఎఫ్ సబ్సిడరీ కంపెనీ) అనే సంస్థ రూపొందించిన కంటైనర్ ఆధారిత సోలార్, స్టోరేజ్ ప్లాంట్.. అనే దాన్ని పరీక్షించబోతున్నది. ఏఆర్ఈపీ కనుగొన్న ఈ విధానంలో సోలార్ ప్యానెల్స్‌ను రైళ్లు, రైలు పట్టాలపై ఏర్పాటుచేయవచ్చు.
అవసరమైన చోటకు తీసుకుపోయి బిగించవచ్చు. ‘సాల్వింగ్ ప్రాజెక్ట్’ పేరుతో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎస్ఎన్సీఎఫ్ విద్యుత్ నెట్వర్క్ కోసం చేపట్టారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయితే,పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్‌లపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటుచేస్తారని తెలిసింది.