ఆధునిక సాంకేతిక అన్నిరంగాల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నది. ప్రతి పనిలోనూ ఏదో ఒకరకంగా ఉపయోగపడుతున్నది. ముఖ్యంగా.. పిల్లల చదువులు, వినోదంతోపాటు సామాజిక కార్యకలాపాల్లోనూ ‘స్మార్ట్ గ్యాడ్జెట్స్’పైనే ఆధారపడాల్సి వస్తున్నది. అదే సమయంలో.. ఈ డిజిటల్ విప్లవం పిల్లల సైబర్ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అవగాహనలేమి.. ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో పాఠశాలల్లోని పిల్లలకు అనేక యాప్‌లు అనివార్యమయ్యాయి. కానీ, అనుమతులను సరిగ్గా నిర్వహించకుంటే.. అవి వారి గోప్యతకు భంగం కలిగించడంతోపాటు భద్రతాపరమైన చిక్కులు తెస్తాయి. అనవసరమైన అనుమతులు డేటా ట్రాకింగ్, లక్ష్య ప్రకటనల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికీ దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మనదేశంలో పిల్లలపై సైబర్ నేరాలలో 32 శాతం పెరుగుదల కనిపించిందని ఓ అధ్యయనంలో తేలింది కూడా. ఇందుకు ప్రధాన కారణం.. మొబైల్ యాప్‌లలో తెలియకుండా ఇచ్చే అనుమతులేనని అధ్యయనకారులు చెప్పుకొచ్చారు. కాబట్టి, పిల్లలు యాప్‌లను ఉపయోగించడానికి ముందు.. తల్లిదండ్రులు వాటిని సమీక్షించడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఇందుకు సంబంధించి పలు సూచనలు అందిస్తున్నారు.
చివరగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని డిజిటల్ సాధనాలకు దూరం చేయడం దాదాపు అసాధ్యమే! కాబట్టి, వారు సాంకేతికతను సురక్షితంగా, తెలివిగా ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవడం ముఖ్యం. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది.