Shoban Babu| తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు శోభన్ బాబు. ఇప్పటి కాలం వారికి శోభన్ బాబు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కాని అప్పుడైతే అమ్మాయిలు శోభన్ బాబుని చూసి తెగ ఫిదా అయ్యేవారు. ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అప్పట్లో శోభన్ బాబు సినిమాలు థియేటర్స్‌లో రిలీజైతే.. ఆడవాళ్లు జాతర మాదిరిగా వెళ్లేవారు. ఈ క్రమంలో శోభన్ బాబు సినిమాలకు స్పెషల్‌గా ఆడవాళ్లకు మాత్రం ఒక టికెట్ ఇచ్చేవారు. మగవాళ్లకు రెండు టికెట్స్ ఇచ్చేవారని అప్పట్లో కొన్ని పత్రికలు రాసుకొచ్చాయి. ప్రత్యేకమైన హెయిర్ కట్ , యాక్టింగ్ , డాన్స్ ఇలా.. అన్నింటిలో హీరోగా తనను తాను నిరూపించుకున్నాడు శోభన్ బాబు.
Shoban Babu
తన అందం కాస్త తగ్గిన తర్వాత శోభన్ బాబు మళ్లీ తెరపైన కనిపించేందుకు ఇష్టపడలేదు. ఎన్ని సినిమా ఆఫర్స్, సీరియల్ ఆఫర్స్ వచ్చిన కూడా వాటిని సింపుల్‌గా రిజెక్ట్ చేశాడు ఈ సోగ్గాడు. అయితే ముసలి పాత్రలు చేస్తే.. తనను యాక్సప్ట్ చేయరని భావించిన శోభన్ బాబు.. 60 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం తన ఫోటో ఒక్కటి కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు శోభన్ బాబు. ఇక తన కెరియర్లో శోభన్ బాబు ఎంతో మంది హీరోయిన్స్‌తో చిందులేశారు. జయప్రద, జయసుధ, శ్రీదేవి, రాధ, మాధవి, లక్ష్మి విజయశాంతి, లాంటి ఎందరో హీరోయిన్లు శోభన్ బాబుకి జంటగా నటించారు.
అయితే ఈ భామలలో ఒకరిని మాత్రం శోభన్ బాబు సరదాగా అత్తా అని పిలిచేవారట.ఆ హీరోయిన్ మరెవరో కాదు జయప్రద. జయప్రద అంటే శోభన్ బాబుకు చాలా అభిమానమట. జయప్రదతో శోభన్ బాబు చాలా సినిమాలు చేయగా, అందులో హిట్ సినిమాలే ఎక్కువ. ఇక ఆయన సెట్ లో కాని.. బయట కాని అత్తా అంటు జయప్రదను పిలుస్తూ ఉండేవారట. ఈ విషయాన్ని జయప్రదనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆడవాళ్లకి అభిమాన హీరో అయిన శోభన్ బాబు..కాలం చేసినప్పుడు చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు కూడా మా ఇంట్లో ఎంతో మంది హీరోలున్న మా ఇంటి ఆడవాళ్లకు హీరోగా శోభన్ బాబు సినిమాలు అంటేనే చాలా ఇష్టమని వారు చెప్పడం గమనర్హం.