Sneha Reddy | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. సినిమా రంగానికి నేరుగా సంబంధం లేకపోయినా, స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ ఆమె సొంతం. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లోనే వైరల్ కావడం సాధారణమైపోయింది. తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బేబీ పింక్ షేడ్ లాంగ్ డ్రస్‌లో ఎంతో ఎలిగెంట్‌గా కనిపించిన ఆమె, సింపుల్ మేకప్ మరియు నేచురల్ హెయిర్ స్టైల్‌తో క్లాస్ లుక్‌ను ప్రెజెంట్ చేశారు. డ్రస్‌కు తగ్గట్టుగా క్యారీ చేసిన మినిమల్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఆమె స్టైల్‌ను మరింత హైలైట్ చేసింది.
ఓవర్ స్టైలింగ్ లేకుండా సింపుల్‌గా కనిపించినా, అందులోనే ప్రత్యేకమైన గ్రేస్ కనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫోటోలు షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడంతో ఫ్యాన్స్ “గార్జియస్”, “ఎవర్ గ్రీన్ బ్యూటీ”, “హీరోయిన్లా ఉన్నారు” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు కూడా “సూపర్ వదినమ్మ” అంటూ కామెంట్లతో సందడి చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఆమె లుక్‌ను మెచ్చుకుంటూ రియాక్ట్ అవుతున్నారు.
పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత స్నేహ రెడ్డి పాపులారిటీ మరింత పెరిగింది. అయాన్, అర్హలతో కలిసి ఫ్యామిలీ మూమెంట్స్‌ను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఫ్యాషన్ విషయంలో ఆమె ఎంపికలు ఎప్పుడూ ట్రెండీగా, క్లాసిక్ టచ్‌తో ఉండటం ప్రత్యేకత. అందుకే ఆమె ఫోటోషూట్లు యువతకు స్టైల్ ఇన్స్పిరేషన్గా మారుతున్నాయనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది.