హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : కేరళ, తమిళనాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి, నెల్లూరు రైల్వే స్టేషన్లు, బొల్లాపల్లి టోల్ ప్లాజా వంటి కీలక ప్రదేశాల్లో ఒక మహిళతో స హా 16 మందిని అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియ ల్ కస్టడీకి తరలించారు. వారి నుంచి 17.90 కి.గ్రా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో రూ.5.5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు బంగారం డెలివరీ చేసే క్రమంలో ముగ్గురు వ్యక్తుల కండ్లుగప్పి సినీఫకీలో కారు డ్రైవర్ పరారయ్యాడు. కారును నందిగామ వద్ద వదిలివెళ్లాడు. నందిగామ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.