న్యూఢిల్లీ, అక్టోబర్ 27: రేషన్ షాపుల ద్వారా చిన్న ఎల్పీజీ సిలిండర్లను అమ్మాలని భావిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం బుధవారం తెలిపింది. రేషన్ షాపుల ఆదాయం పెంపు చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదన చేసినట్టు పేర్కొన్నది. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే బుధవారం రాష్ర్టాల అధికారులతో వర్చువల్గా భేటీ అయ్యారు. సిలిండర్ల అమ్మకానికి రేషన్ షాపులకు ముద్రా పథకం కింద నిధులు అందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు ఆమె తెలిపారు.