2020 నవంబర్.. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఆయనకు అకస్మాత్తుగా కళ్లు తిరిగాయి. డాక్టర్లు పరీక్షించి మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యింది.. బ్రెయిన్ స్ట్రోక్ అని తేల్చారు. మూడు రోజులు ఐసీయూలో ఉంచారు. కోమాలోకి వెళ్లిన పేషెంట్స్ మధ్య ఆయన నవ్వుతూ కనిపిస్తే డాక్టర్లే ఆశ్చర్యపోయారు. బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు జీవితంలో కోలుకోవడమే కష్టం.. పెద్ద సర్జరీ చేసినా చాలామంది బెడ్రూంకు మాత్రమే పరిమితమవుతారు. కొందరు కోలుకుంటారు కానీ బయటపనులు చేసుకోలేరు. కానీ ఈయన ఆత్మవిశ్వాసం ముందు బ్రెయిన్ స్ట్రోకే తోకముడిచిందని డాక్టర్లే చెప్పడం విశేషం. మరి బ్రెయిన్స్ట్రోక్పై తన ఫిట్నెస్తో విజయం సాధించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందా..? అయితే, ఈ వీడియో చూడండి.