ఆరేళ్ల పిల్లాడు అద్భుతాన్ని కనిపెట్టాడు
ఆరేళ్ల పిల్లాడు అద్భుతాన్ని కనుగొన్నాడు.. ఆడుకుందాం అని గార్డెన్‌లోకి వెళ్లిన బుడతడు కోట్ల ఏళ్ల నాటి శిలాజాలను గుర్తించాడు.

ఆరేళ్ల పిల్లాడు అద్భుతాన్ని కనుగొన్నాడు.. ఆడుకుందాం అని గార్డెన్‌లోకి వెళ్లిన బుడతడు కోట్ల ఏళ్ల నాటి శిలాజాలను గుర్తించాడు. ఏదో పెద్ద పురాతత్వ శాస్త్రవేత్తలా ఇంటి వెనుక ఉన్న గార్డెన్‌లా తవ్వకాలు చేపట్టిన ఆ బుడతడు.. నిజంగానే పురాతన కాలం నాటి శిలజాలు దొరకడంతో తెగ సంబరపడిపోతున్నాడు. ఆ ఆరేళ్ల పిల్లాడు మన భారత సంతతికి చెందిన బుడతడే. పేరు సిద్ధక్ సింగ్ జమాత్. ఉండేది బ్రిటన్‌లోని పశ్చిమ మిడ్‌ల్యాండ్స్‌లో..
అందరూ ముద్దుగా సిధ్ అని పిలుచుకునే సిద్దక్ సింగ్‌కు క్రిస్మస్ సందర్భంగా ఓ గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్‌లో ఉన్నది ఫాజిల్ హంటింగ్ సెట్. ఇంకేముంది.. దాన్ని ఎలాగైనా వాడాలని భావించిన సిద్.. తమ ఇంటి వెనుక ఉన్న తోటలో ఎక్కడ పడితే అక్కడ తవ్వడం మొదలు పెట్టాడు. ఏవైనా కీటకాలు, ఇంకేవైనా మట్టివస్తువులు, ఇటుకలు ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అనే ఆశతో అక్కడక్కడ తవ్వకాలు జరిపాడు. ఇంతలో కొమ్ములాంటి ఒక వస్తువు సిధ్ కంటపడింది. అదేమై ఉంటుందోనని అర్థం కాక సిధ్ తన తండ్రికి దాన్ని చూపించాడు. మొదట అది ఏదో జంతువు దంతం లేదా గోరు లేదా కొమ్ము అయి ఉండొచ్చని భావించారు. కానీ అది హార్న్ కోరల్ అని తెలిసింది. అది కూడా 25 నుంచి 48 కోట్ల ఏళ్లనాటిదని అంచనా వేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ముకేశ్ సహా మన కుబేరులకు టెస్లా ఎంతో ఇష్టం..
మరింత తీవ్రంగా కరోనా.. మాస్కులు ఉండాల్సిందే
ముఖంపై గోధుమరంగు మచ్చలు.. బైబై చెప్పేందుకు చిట్కాలు
‘ఆ మహిళ హాబీ రూ లక్షలు కురిపించింది’
భిన్నంగా పురుషులు, మహిళల మెదళ్లు.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

