Gadipally Bhaskar : బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అసవరాలు తీరగానే అవతలి పార్టీలకు వెళ్లిన పలువురికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు షాకిచ్చారు. మెదక్ జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన గాడిపల్లి భాస్కర్‌ను ఛైర్మన్ పదవి కూడా వరించింది. 2014 నుంచి 2020 వరకు ఏకంగా ఆరేళ్లు మున్సిపల్ ఛైర్మన్ పదవి అనుభవించాడు.
అవసరం తీరిన తర్వాత బీఆర్ఎస్ను వదిలేసి బీజేపీలో చేరాడు. ఈ ఎన్నికల్లో ఆయన భార్య గాడిపల్లి కళ్యాణిని బీజేపీ అభ్యర్థిగా బరిలో దించాడు. కానీ ఓటర్లు కళ్లుబైర్లు కమ్మేలా షాకిచ్చారు. ఏకంగా 529 ఓట్ల తేడాతో ఓడించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గోలి మమత ఆమెపై ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థికి ప్రయోజనం దక్కలేదు.