నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 5 : యాసంగి సీజన్లో ఇతర పంటలసాగు లాభదాయకమని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ అన్నారు. యాసంగి సాగుపై జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులకు ఆదివారం విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో వ్యవసాయాధికారి గోవింద్ పాల్గొన్నారు. యాసంగిలో పొద్దు తిరుగుడు, వేరుశనగ తదితర పంటలను సాగు చేయాలన్నారు. సర్పంచ్ పాశం సత్తెవ్వ, ఉపసర్పంచ్ రాజేందర్, మండల వ్వవసాయాధికారిణి స్వప్న, ఏఈవో ప్రకాశ్, విలేజ్ కో-ఆర్డినేటర్ గంగదాస్, రైతులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి మండల కలిగోట్లోని రైతువేదిక భవనంలో ఏడీఏ వెంకటలక్ష్మి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయశాఖ రూపొందించిన క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఏవో దేవిక, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డీకొండ శ్రీనివాస్, ఏఈవో శివప్రసాద్, సర్పంచ్ చేతన, ఎంపీటీసీ జయ, ఉపసర్పంచ్ రాజు, క్లస్టర్ పరిధిలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, నాయకులు విజయ్‌రెడ్డి, గిరిధర్‌గౌడ్ పాల్గొన్నారు.
యాసంగిలో వరిసాగు చేయాలనుకునే రైతులు బైబ్యాక్ ఒప్పందం ఉంటేనే సాగు చేయాలని ధర్పల్లి మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ రైతులకు సూచించారు.
యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగుచేయాలని ఏడీఏ హరికృష్ణ అన్నారు. ఈమేరకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేతులమీదుగా పోస్టర్, బుక్‌లెట్‌ను ఆదివారం ఆర్మూర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, సర్పంచ్ కల్లెం మోహన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భోజారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, ఎంపీటీసీలు మహేశ్, మల్లేశ్, రైతుబంధు కో-ఆర్డినేటర్ రమేశ్‌రెడ్డి, రాంరెడ్డి, ఏఈవో వసుధాం, రైతులు పాల్గొన్నారు.
రైతులు యాసంగిలో ఇతర పంటల సాగుపై దృష్టిసారించాలని మాక్లూర్ మండలంలోని అమ్రాద్‌లో ఏవో పద్మ, నవీపేట మండలం జన్నేపల్లిలో వ్యవసాయాధికారి సురేశ్‌గౌడ్, రెంజల్ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏవో లక్ష్మీకాంత్‌రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు.
రైతులు యాసంగిలో వాణిజ్య, నూనె, పప్పు జాతి పంటలను సాగుచేయాలని ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్ రైతువేదిక భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏవో మహ్మద్ అబ్దుల్ మాలిక్, ముప్కాల్ మండలం రెంజర్లలో ఏవో రాజ్‌కుమార్, భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ క్లస్టర్ పరిధిలోని రైతువేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏడీఏ కిరణ్మయి అన్నారు.
మోర్తాడ్ మండలంలోని దొన్కల్ గ్రామ రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఏవో లావణ్య, కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి రైతువేదికలో ఎఫ్‌టీసీ ఏవో రవీందర్ యాసంగిలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
బోధన్ మండలం కల్దుర్కిలో ఏవో సంతోష్‌నాయక్, ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో సర్పంచ్ కోల ఇంద్రకరణ్, ఏవో సిద్ధిరామేశ్వర్ రైతులకు ఆరుతడి పంటల సాగుపై పలు సూచనలు చేశారు.