హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికైన తెలంగాణ ప్లేయర్ శివాంశికను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన శివాంశిక ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అండర్-14 చెస్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. శివాంశిక ప్రతిభను గుర్తించి అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి అహ్మదాబాద్‌లో జరుగనున్న జాతీయ స్థాయి చెస్ టోర్నీలో కూడా శివాంశిక సత్తా చాటాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఎంఎస్ గౌడ్, శివాంశిక తల్లి భవానీ తదితరులు పాల్గొన్నారు.