హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా ఎన్ శివకుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చర్లపల్లి వ్యవసాయకాలనీ జైలు(ఓపెన్‌ఎయిర్ జైలు) సూపరింటెండెంట్‌గా ఉన్న శివకుమార్గౌడ్ను చంచల్‌గూడకు బదిలీ చేశారు. జైళ్లశాఖలో డీఎస్పీగా ఉన్న టీ కళాసాగర్కు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించి చర్లపల్లి వ్యవసాయకాలనీ జైలుకు బదిలీ చేశారు.