ఆదిలాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ) : మావలలో శనివారం అక్కా, తమ్ముడు సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు. మావలకు చెందిన స్వామి కూతురు వినూత్న(11), కుమారుడు విధాత(9) గ్రీన్‌సిటీ సమీపంలో నుంచి సైకిల్‌పై వెళ్తుండగా పక్కనే ఉన్న నీటిగుంతలో పడిపోయారు.
ఇటీవల కురిసిన వర్షాలతో గుంతలో నీరు ఎక్కువగా ఉండడంతో ఇద్దరు చిన్నారులు మునిగిపోయారు. స్థానికులు అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఇద్దరు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కా, తమ్ముడు మరణించడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మావల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.