RCB vs GT : టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కష్టాల్లో పడింది. సిరాజ్ విజృంభణతో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(1) శుభ్మన్ గిల్(2)లు పెవిలియన్ చేరారు. తొలుత సిరాజ్ తన మొదటి ఓవర్లోనే ఒక్క పరుగుతో ఉన్న సాహాను వెనక్కి పంపాడు. ఆ తర్వాత యశ్ దయాల్ సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బ్యాటింగ్ జట్టు స్కోర్ నెమ్మదించింది.
ఒక్క పరుగుకే సాహా వెనుదిరిగాక.. సాయి సుదర్శన్(6)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్న గిల్ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. దాంతో, 10 పరుగులకే గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సాయి, షారుక్ ఖాన్(7)లు ఆడుతున్నారు. 5 ఓవర్లకు స్కోర్.. 18/2.