జగిత్యాల : ఒకటి కాదు.. రెండు కాదు.. ఓ బైక్పై ఏకంగా 47 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. బుధవారం జగిత్యాలలో ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ల క్లియరెన్స్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అటుగా వచ్చిన నీలకంఠం అనే వ్యక్తి బైక్ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో తనిఖీ చేయగా 47 చలాన్లు పెండింగ్లో ఉన్న విషయం వెలుగుచూసింది. నిబంధనల ప్రకారం పెండింగ్లో ఉండవద్దని ట్రాఫిక్ ఎస్సై రాము సూచించడంతో వెంటనే సదరు వాహనదారుడు రూ.11,110 మొత్తాన్ని చెల్లించాడు.