ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
సింగరేణి సంస్థ కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో రుద్రంపూర్‌లోని సి.ఈ.ఆర్ క్లబ్లో నిర్వహించిన కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ టోర్నమెంట్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అక్టోబర్ 30, 31 తేదీలలో రెండు రోజుల పాటు...
రుద్రంపూర్, అక్టోబర్ 31 : సింగరేణి సంస్థ కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో రుద్రంపూర్‌లోని సి.ఈ.ఆర్ క్లబ్లో నిర్వహించిన కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ టోర్నమెంట్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అక్టోబర్ 30, 31 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ క్రీడా సంబరాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జీఎం ఎం. గోవిందరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కంపెనీ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. అనంతరం చెస్, క్యారమ్స్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అతిథులు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూ.పి.ఎస్ & జి.ఎ వైస్ ప్రెసిడెంట్, కొత్తగూడెం ఏరియా పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య (కె.జి.ఎమ్), ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎమ్.డి. రజాక్ (కె.జి.ఎమ్), సత్తుపల్లి ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్. సుధాకర్, సత్తుపల్లి ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వర రావు పాల్గొన్నారు. అలాగే సంస్థలోని ఆరు రీజియన్లు అయిన ఆర్.జి-I & II, ఆర్.జి-III & బి.హెచ్.పి.ఎల్, బి.పి.ఎ & ఎమ్.ఎమ్, ఎస్.ఆర్.పి, వై.ఎల్.డి & ఎమ్.ఎన్.జి, కార్పొరేట్ & కె.జి.ఎమ్ లకు చెందిన క్రీడాకారులతో పాటు అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్లు ఎమ్.సి. పాస్నెట్, చ. అశోక్, ఎమ్. నరేందర్ రెడ్డి, పర్స శ్రీనివాస్, వివిధ విభాగాలైన పర్సనల్, ఎస్&పిసి, ఈ&ఎం, సివిల్ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

