హనుమకొండ, సెప్టెంబర్ 16: నాయీ బ్రాహ్మణ వృత్తి కేవలం జీవనోపాధి కాదు, ఒక సంస్కృతి, సంప్రదాయం, సేవకు ప్రతీకని హనుమకొండ పట్టణ అధ్యక్షుడు సింగారపు శ్యామ్ అన్నారు. మంగళవారం వరల్డ్ బార్బర్స్డే సందర్భంగా హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన సమాజంలో ప్రతి వృత్తికి ఒక ప్రత్యేక స్థానం, ఒక గౌరవం ఉంటుందని అలాంటి గొప్ప వృత్తులలో నాయీబ్రాహ్మణ వృత్తి ఒకటన్నారు.
ఈ వృత్తికి వందేళ్ల చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, సాంఘిక సేవల గొప్పతనం కలిగి ఉందన్నారు. ప్రస్తుత రోజుల్లో మోడరన్ సెల్లూన్లు, స్టైలింగ్ సెంటర్లు వచ్చినా కూడా నాయీబ్రాహ్మణుల వృత్తి ఎంతో గొప్పదన్నారు. రాబోయే రోజులలో కమ్యూనిటీ అంతా ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెబుతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి గొప్ప విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ , ప్రభాకర్, ఐలయ్య, గురుమూర్తి, రాజేంద్రప్రసాద్, యాదగిరి, కృష్ణ, కిరణ్ పాల్గొన్నారు.