స్పెయిన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు, శ్రీకాంత్ ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 21-7, 21-9తో మార్టినా రెపిస్కా (స్లోవేకియా)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీకాంత్ 15-21, 21-18, 21-17తో లీ షి ఫెంగ్ (చైనా)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో తొలిరౌండ్ ‘బై’తో నేరుగా రెండో రౌండ్లోకి ప్రవేశించిన లక్ష్యసేన్ 22-20, 15-21, 21-18తో కెంటా నిషిమొటో (జపాన్)ను చిత్తు చేశాడు. పురుషుల డబుల్స్‌లో భారత ద్వయం సాత్విక్-చిరాగ్ శెట్టి ముందంజ వేసింది.