కొండపాక, మార్చి 23 : నిరుపేద మృతుడి కుటుంబానికి దాతలు ఆర్థిక సాయం అందజేశారు. కొండపాక గ్రామానికి చెందిన కొమ్ము మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న మృతుడి కుటుంబ సభ్యులను డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పరామర్శించి రూ.10 వేలు అందజేశారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత..
బెజ్జంకి, మార్చి 23 : మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెం దిన చిట్టెల మల్లవ్వ ఇటీవల మృతి చెందింది. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరిగంటి ఆనంద్ యువసేన ఆధ్వర్యంలో బుధవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బి య్యాన్ని అందజేశారు. వారి వెంట యువసేన ఆధ్వర్యంలో మ హేందర్, రాజ్‌కుమార్, మనోజ్‌కుమార్, కుమార్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
తొగుట, మార్చి 23 : బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన కంకణాల లక్ష్మి (55) గుండెపోటుతో మృతి చెందింది. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కంకణాల నర్సింహులుతో కలిసి బుధవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు నందారం నరేందర్‌గౌడ్ తల్లి చిత్తారమ్మ(80) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న రాంరెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ లీలాదేవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోచయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకట్‌గౌడ్, నాయకులు ఉన్నారు.