
అందోల్, అక్టోబర్ 29 : రేషన్‌డీలర్ల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సంగుపేట ఫంక్షన్హాల్లో జిల్లా రేషన్‌డీలర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ రేషన్‌సరుకులు అందజేస్తూ డీలర్లు ఎంతో ప్రజా సేవ చేస్తున్నారన్నారు. కరోనాలాంటి కష్టకాలంలో సైతం డీలర్లు ముందుండి ప్రజలకు సేవలు అందించారని గుర్తుచేశారు. డీలర్లంటే ప్రజల ఆకలి తీర్చేవారని, ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక భూమిక డీలర్లదేనని వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉన్నదని చెప్పారు. అందులో భాగంగా డీలర్లను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి మొదటి ప్రాధాన్యతగా కొవిడ్ వ్యాక్సిన్లు అందించారని పేర్కొన్నారు. డీలర్ల సంక్షేమకోసం ప్రభుత్వం ఇప్పట్టికే పలు రకాలుగా సహాయ.. సహకరాలు అందిస్తున్నదని వారికి మరిన్ని వసతులు సమకూరేలా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. అనంతరం డీలర్లు, సంఘం నాయకులు జడ్పీచైర్మన్తో పాటు ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డిలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షుడు పుష్పరాజ్కాకా, రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, గౌరవ అధ్యక్షుడు అనంతయ్య, కార్యదర్శి సదృద్దీన్గోరి, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, కోశాధికారి అల్లెమహేశ్, జిల్లాలోని వివిధ మండలాల డీలర్లు పాల్గొన్నారు.