బెంగుళూరు: డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను బెయిల్‌పై రిలీజ్ చేశారు. సిద్ధాంత్‌తో పాటు అరెస్టు అయిన మరో నలుగుర్ని కూడా రిలీజ్ చేశారు. ఆదివారం రాత్రి బెంగుళూరులో జరిగిన పార్టీలో సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ తీసుకున్నాడు. మెడికల్ రికార్డులు అతను డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టం చేస్తున్నాయని డీసీపీ బీమాశంకర్ తెలిపారు. ఎంజీ రోడ్డులో ఉన్న ఓ హోటల్‌పై దాడి చేయగా సిద్ధాంత్‌తో పాటు మరో నలుగురు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఘటనలో మొత్తం 35 మంది అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉన్న వ్యక్తుల శ్యాంపిళ్లను మెడికల్ పరీక్షలకు పంపారు. హోటల్లో డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట తీసుకుని పార్టీకి వచ్చారా స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పారు.